పోలీసులకు చిక్కిన  నిత్య పెళ్లికొడుకు
close

తాజా వార్తలు

Published : 02/04/2021 01:34 IST

పోలీసులకు చిక్కిన  నిత్య పెళ్లికొడుకు

విశాఖపట్నం: విశాఖలో సంచలనం రేపిన నిత్య పెళ్లికొడుకు అరుణ్ కుమార్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ, పెళ్లి పేరుతో మహిళలకు వల వేసి వారిని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్న మోసగాడి ఉదంతం నిన్న వెలుగులోకి వచ్చింది. పోలీస్‌ బాస్‌ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలతో విశాఖ పోలీసులు అరుణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటి వరకు అరుణ్‌కుమార్‌ పెళ్లి పేరుతో ఎంతమందిని మోసం చేశాడనే వివరాలు రాబడుతున్నారు. నిందితుడి నుంచి వచ్చిన సమాచారం మేరకు బాధితులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. అరుణ్‌ కుమార్‌ చేతిలో మోసపోయిన వారు నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈకేసులో ఫిర్యాదు చేసిన ఇద్దరు బాధిత మహిళల నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. అరుణ్‌ కుమార్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది ఉన్నట్టు తెలుస్తోంది. నిందితుడి చరవాణి ఆధారంగా లభ్యమైన వివరాలు పరిశీలిస్తున్నారు. వ్యభిచారం, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు ఆధారాలు సేకరించారు. ఈ కేసులో ఫిర్యాదు చేసిన ఓ మహిళ భర్త అనుమానాస్పద మృతి కేసులోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. అరుణ్‌కుమార్‌ ఇంటిలో మారణాయుధాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు ఇతనికి ఎవరి సహకారం ఉండేదనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఫిర్యాదు అందినా నిర్లక్ష్యం వహించిన పోలీసుల పాత్రపైనా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని