Aryan Khan: ఖైదీ నెం. 956 షారుక్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌

తాజా వార్తలు

Published : 16/10/2021 02:38 IST

Aryan Khan: ఖైదీ నెం. 956 షారుక్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌

ముంబయి: బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ తరచూ డ్రగ్స్‌ తీసుకుంటుంటారని మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఇక బెయిల్‌ ఇవ్వొద్దని వాదించింది. దీంతో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 20కి కోర్టు వాయిదా వేసింది. అప్పటివరకూ ఆర్యన్‌ జైల్లోనే ఉండనున్నాడు. ఇక జైల్లో  ఖైదీగా ఉన్న ఆర్యన్‌కు అధికారులు నెం.956ని కేటాయించారు. ఇంటి నుంచి తండ్రి షారుక్‌ పంపిన రూ.4500 మనీ ఆర్డర్‌ను అందుకున్నాడు. ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులోని క్యాంటీన్ ఖర్చులు (ఆహారంతో పాటు ఇతరత్రా అవసరాలు) కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నాడు. జైలు నియమ నిబంధనల ప్రకారం.. అరెస్టయి జైల్లో ఉన్నవారికి రూ.4500 మాత్రమే గరిష్ఠంగా ఇచ్చేందుకు అనుమతిస్తారు. బొంబే హైకోర్టు ఆదేశానికి అనుగుణంగా.. ఖైదీలు వారానికి ఒకసారి వారి కుటుంబసభ్యులతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ ప్రకారం ఆర్యన్‌ శుక్రవారం తన తండ్రి షారుక్‌, అమ్మ గౌరీఖాన్‌తో కాసేపు వీడియోకాల్‌లో మాట్లాడినట్టు సమాచారం. ఆర్థర్ రోడ్ జైలు సూపరింటెండెంట్‌ నితిన్‌ మాట్లాడుతూ... ఆర్యన్‌కు జైలు ఆహారం మాత్రమే ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. స్టార్‌హీరో కొడుకు అయినా సరే! కోర్టు ఉత్తర్వులు జారీ అయ్యేవరకూ ఇంటి భోజనాన్ని కానీ బయటి ఆహారాన్ని కానీ అనుమతించే ప్రసక్తే లేదన్నారు. కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్‌ రిపోర్టు రావడంతో కామన్‌ సెల్‌కి పంపించామన్నారు. ఇక జైల్లో ఆర్యన్‌ చాలా అసౌకర్యంగా ఉన్నారని, టెన్షన్‌ పడుతూ కనిపిస్తున్నట్లు సమాచారం. జైలు ఆహారాన్ని ఏ మాత్రం ఇష్టపడట్లేదట.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని