Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ విచారణ వాయిదా

తాజా వార్తలు

Published : 14/10/2021 02:33 IST

Aryan Khan: ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ విచారణ వాయిదా

ముంబయి: మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్‌స్టార్‌ షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ విచారణ మరో రోజుకు వాయిదా పడింది. దీంతో అతడు మరో రోజు జైల్లో గడపనున్నాడు. ఆర్యన్‌ ఖాన్‌ను అరెస్టు చేసిన నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) తరఫున వాదించిన ఏఎస్‌జీ అనిల్‌కుమార్‌ సింగ్‌ తన వాదనలు కొనసాగించిన నేపథ్యంలో కేసు విచారణను కోర్టు గురువారం నాటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కేసు విచారణ కొనసాగనుంది.

విచారణ సందర్భంగా ఆర్యన్‌ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాతో సంబంధాలు ఉన్నట్లు నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో కోర్టుకు తెలిపింది. తమ విచారణలో ఈ విషయం బహిర్గతమైనట్లు పేర్కొంది. అయితే పట్టుబడిన సమయంలో అతడి వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు లభ్యం కాలేదని స్పష్టం చేసింది. అయితే ఒక వ్యక్తికి బెయిల్ ఇవ్వడం వల్ల దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని కోర్టుకు తెలిపింది.

ఆర్యన్‌ఖాన్‌ తరఫున వాదించే సీనియర్‌ న్యాయవాది అమిత్‌ దేశాయ్‌ మాట్లాడుతూ.. ఎన్సీబీ దాడి చేసిన సమయంలో రేవ్‌ పార్టీ జరుగుతున్న క్రూజ్‌ నౌకలోనే లేడని వాదించారు. పార్టీకి వెళుతుండగా ఆర్యన్‌తోపాటు మరో వ్యక్తి అర్బాజ్‌ను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. అర్బాజ్‌ వద్ద 6 గ్రాముల చరాస్‌ (మత్తు పదార్థం) దొరికినట్లు వెల్లడించారు. కాగా ఆర్యన్‌ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ దొరకలేదని కోర్టుకు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని