Drugs Case: ఆర్యన్‌కు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

తాజా వార్తలు

Published : 22/10/2021 01:36 IST

Drugs Case: ఆర్యన్‌కు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు

ముంబయి: డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కు ఎన్సీబీ ప్రత్యేక న్యాయస్థానం జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగించింది. ఆర్యన్‌తో పాటు అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ ధామేచాల కస్టడీని ఈ నెల 30 వరకు పొడిగించింది. దీంతో అప్పటివరకు ఆర్యన్‌ జైలులోనే ఉండనున్నాడు. అయితే, నిందితులను భౌతికంగా గానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారాగానీ అధికారులు కోర్టులో హాజరుపరచలేదు.

ముంబయి శివారులోని క్రూజ్‌ నౌకలో డ్రగ్స్‌ కేసులో అక్టోబర్‌ 3న ఆర్యన్‌ సహా ఏడుగురిని ఎన్సీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 7న ముంబయి ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసులో నిందితులకు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. ఆర్యన్‌ ప్రస్తుతం ఆర్ధర్‌ రోడ్డులోని జైలులో ఉంటున్నాడు. బెయిల్‌ కోసం పలుమార్లు దరఖాస్తు చేసుకోగా ఆ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. దీంతో కింది కోర్టు బెయిల్‌ నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ ఆర్యన్‌ తరఫు న్యాయవాదులు బాంబే హైకోర్టులో నిన్న బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై అక్టోబర్‌ 26న విచారణ జరిగే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని