రూ.50లక్షలు, వ్యాన్‌తో సహా ఉడాయించిన ఏటీఎం వ్యాన్‌డ్రైవర్‌

తాజా వార్తలు

Published : 28/07/2021 01:39 IST

రూ.50లక్షలు, వ్యాన్‌తో సహా ఉడాయించిన ఏటీఎం వ్యాన్‌డ్రైవర్‌

నెల్లూరు: ఏటీఎంలో నగదు, వ్యాన్‌తో సహా డ్రైవర్‌ పరారైన ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనం కలిగించింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.50లక్షల నగదు తీసుకుని ఏటీఎంలలో పెట్టేందుకు సెక్యూర్‌ వ్యాలీ క్యాష్‌ ఏజెన్సీ సిబ్బంది,  వ్యాన్‌ డ్రైవర్‌ పోలయ్య వెళ్లారు. ఏటీఎం వద్ద సిబ్బంది కిందకు దిగిన వెంటనే వారి కళ్లుగప్పి డ్రైవర్‌ పోలయ్య రూ.50లక్షల నగదు పెట్టె, వ్యాన్‌తో సహా అక్కడి నుంచి ఉడాయించాడు. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో నెల్లూరు చిన్నబజార్‌ పోలీసులు గాలింపు చేపట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని