Mask గొడవ.. కార్పొరేటర్‌పై దాడి
close

తాజా వార్తలు

Published : 28/04/2021 13:57 IST

Mask గొడవ.. కార్పొరేటర్‌పై దాడి

గుంటూరు: మాస్కు ఎందుకు ధరించలేదు? అని అడిగినందుకు కార్పొరేటర్‌పైనే దాడి చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన గుంటూరు నగరంలో బుధవారం చోటు చేసుకుంది. 32వ డివిజన్‌ కార్పొరేటర్‌ వెంకటకృష్ణచారి ఇవాళ ఉదయం బ్రాడీపేటలో పర్యటించారు. బ్రాడీపేట నాలుగో లైన్‌లోని సాయిచరణ్‌ బాయ్స్‌ హాస్టల్‌ వద్ద యువకులు గుమిగూడి ఉండటాన్ని గమనించారు. అక్కడికి వెళ్లిన కార్పొరేటర్‌ మాస్కు ధరించని యువకుడిని గట్టిగా మందలించారు. ఈ విషయంలో మాటామాటా పెరిగి ఓ యువకుడిపై కార్పొరేటర్‌ చేయి చేసుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువకుడు ‘మా తల్లిదండ్రులే నన్ను కొట్టరు.. మీరు కొడతారా?’ అంటూ కార్పొరేటర్‌పై తిరగబడ్డాడు. తన స్నేహితులతో కలిసి కార్పొరేటర్‌ వెంకటకృష్ణచారిని తిరిగి కొట్టాడు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్‌ అనుచరులు అక్కడికి చేరుకుని వసతి గృహంలోని యువకులను బయటకు తీసుకొచ్చి దాడి చేశారు. సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు అక్కడికి చేరుకొని ఇద్దరు యువకుల్ని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 

విషయం తెలుసుకున్న నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఘటనపై ఆరా తీశారు. కార్పొరేటర్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో మాస్కులు లేకుండా తిరగటం ప్రమాదకరమని చెబితే ఇలా దాడి చేయడమేంటని కార్పొరేటర్‌ ప్రశ్నించారు. బ్రాడీపేటలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున హాస్టళ్లను మూసివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని