Crime: కడపలో ఇంజినీరుపై గ్రామస్థుల దాడి

తాజా వార్తలు

Updated : 25/05/2021 04:31 IST

Crime: కడపలో ఇంజినీరుపై గ్రామస్థుల దాడి

కడప: నీటిపారుదల శాఖ ఇంజినీరుపై కడప జిల్లా బుగ్గవంక నిర్వాసితులు దాడి చేశారు. బుగ్గవంక సుందరీకరణలో భాగంగా చేపట్టిన పనుల కోసం జేసీబీలతో ఇళ్లను కూల్చివేయడంపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా సాగుతున్న కూల్చివేతను అడ్డుకున్న గుర్రాలగడ్డ ప్రజలు ఇంజినీరు రుఘునాథ్‌ రెడ్డిపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. ఆ ప్రాంతానికి ఒంటరిగా వచ్చిన ఇంజినీరు బాధితుల ఆగ్రహంతో భయపడిపోయారు. వెంటనే బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పరుగులు తీశారు. తనపైన జరిగిన దాడిపై ఆయన ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఫోలీసులకు కూడా ఫిర్యాదు చేసే అవకాశముంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని