బ్యాంకుకు తాళం మరచి.. చోరీ అనుకున్నారు

తాజా వార్తలు

Published : 14/07/2021 01:18 IST

బ్యాంకుకు తాళం మరచి.. చోరీ అనుకున్నారు

కనిగిరి: బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం పోలీసులను పరుగులు పెట్టించింది. ప్రకాశం జిల్లాలోని కనిగిరి బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయానికి తాళం వేయడం మరచిన సిబ్బంది హడావుడిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు భవనానికి రెండు తాళాలు ఉండగా.. సోమవారం సాయంత్రం సిబ్బంది ఒక తాళం వేయడం మరచిపోయారు. ఇవాళ ఉదయం విధులకు వెళ్లిన సిబ్బంది ..  తాళం వేయలేదనే పొరపాటు గుర్తించకుండా చోరీ జరిగిందని భావించి వెంటనే పోలీసులకు సమాచారమందించారు. రంగంలోకి దిగిన పోలీసులు బ్యాంకును నిశితంగా పరిశీలించారు. ఆతర్వాత సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. చివరకు బ్యాంకు సిబ్బంది తాళం వేయడం మర్చిపోయినట్టు తేల్చారు. బ్యాంకులో ఎలాంటి చోరీ జరగలేదని నిర్ధరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని