మహిళపై సామూహిక అత్యాచారం
close

తాజా వార్తలు

Published : 26/05/2021 17:51 IST

మహిళపై సామూహిక అత్యాచారం

సమస్తిపుర్‌(బిహార్‌): బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సమస్తిపుర్‌లోని ఓ గ్రామానికి చెందిన మహిళ మంగళవారం ఉదయం బహిర్భూమికని బయటికి వెళ్లింది. ఇది గమనించిన కొందరు దుండగులు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి లాక్కొనివెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం, తీవ్రంగా కొట్టి గాయపరిచారు. ఆమె చనిపోయిందని భావించి పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభానికి వేలాడదీసి అక్కడి నుంచి పరారయ్యారు. అపస్మారక స్థితిలో వేలాడుతూ ఉన్న బాధితురాలిని గుర్తించిన స్థానికులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం  బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది.  బాధితురాలి ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు టెంట్లు వేయడానికి వచ్చిన వ్యక్తులే అత్యాచారానికి పాల్పడి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని