కేరళలో దొంగల బీభత్సం

తాజా వార్తలు

Published : 03/07/2021 14:07 IST

కేరళలో దొంగల బీభత్సం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళలో దొంగలు బీభత్సం సృష్టించారు. బైక్‌ మీద వచ్చిన దుండగులు రోడ్డు మీద నిలబడిన వ్యక్తి ఫోన్‌ను అపహరించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బాధితుడిని రోడ్డు మీద కొంత దూరం ఈడ్చుకెళ్లారు.

వివరాల్లోకి వెళ్తే.. కోజికోడ్‌లో అలీ అనే కార్మికుడి నుంచి దుండగులు ఫోన్ మాట్లాడాలంటూ చరవాణి తీసుకున్నారు. అనంతరం అతని కళ్లుగప్పి ఫోన్‌తో ఉడాయించేందుకు ప్రయత్నించారు. అయితే దొంగలు వచ్చిన ద్విచక్రవాహనాన్ని అలీ వదలకుండా పట్టుకోగా అతణ్ని అలాగే ఈడ్చుకెళ్లారు. ఈ క్రమంలో అలీ సహా ద్విచక్రవాహనం వెనక కూర్చున్న దొంగ కూడా కింద పడిపోయాడు. తర్వాత తేరుకున్న దొంగలు స్థానికులకు చిక్కకుండా పరారయ్యారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని