
తాజా వార్తలు
దారి ఇవ్వలేదని డ్రైవర్‌పై కత్తితో దాడి
హన్సూర్: ఓవర్ టేక్ చేసేందుకు దారి ఇవ్వలేదన్న కోపంతో ఓ బైక్ రైడర్ బస్సు డ్రైవర్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని బిల్కేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి కేఆర్ నగర్‌కు వెళ్తున్న బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడు. బస్సు డ్రైవర్ వెంకటేశ్ అవకాశం ఇవ్వకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన బైక్ రైడర్ అందరూ చూస్తుండగానే కత్తితో వెంకటేశ్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈఘటనలో గాయపడిన వెంకటేశ్ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బైక్ రైడర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈఘటనపై బిల్కేర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఇవీ చదవండి...
ప్రొద్దుటూరులో ప్రేమోన్మాది ఘాతుకం
Tags :