TS News: నిబంధనలకు విరుద్ధంగా బర్త్‌డే పార్టీ
close

తాజా వార్తలు

Updated : 13/06/2021 15:39 IST

TS News: నిబంధనలకు విరుద్ధంగా బర్త్‌డే పార్టీ

కడ్తాల్‌: రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో నిబంధనలకు విరుద్ధంగా బర్త్‌డే పార్టీ జరిగింది. ఓ ఫామ్‌హౌస్‌లో శనివారం అర్ధరాత్రి యువత మద్యం తాగి చిందులేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి అడ్డుకున్నారు. ఈ వేడుకల్లో 70మందికి పైగా యువతీయువకులు పాల్గొన్నారు. ఈ వ్యవహారంలో ముగ్గురు నిర్వాహకులను అరెస్ట్‌ చేసిన పోలీసులు.. మొత్తం 55 మందిపై కేసులు నమోదు చేశారు. ఘటనాస్థలంలో భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీజేను సీజ్‌ చేశారు. పార్టీలో ఉన్నవాళ్లంతా హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులే. వీరిలో 20 మంది యువతులున్నారు. భరత్‌ అనే వ్యక్తి ఈ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని