
తాజా వార్తలు
గుంటూరు నేత.. ప్రకాశం పోలీసులు అరెస్టు!
గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన భాజపా నేత మందడపు శ్రీనివాసరావును గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం ఇంటి నుంచి తీసుకెళ్లడం కలకలం రేపింది. ఇటీవల రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి సామాజిక మాధ్యమంలో శ్రీనివాసరావు స్పందించారు. ఈ క్రమంలో ఆదివారం ప్రకాశం జిల్లా పోలీసులమని కొందరు ఆయణ్ని తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులకు సమాచారం లేనట్లు తెలుస్తోంది.
దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో సత్తెనపల్లి పోలీస్స్టేషన్లో శ్రీనివాసరావు భార్య శిరీష ఫిర్యాదు చేశారు. భాజపా నేత అరెస్టుపై ఇప్పటి వరకూ పోలీసులు స్పందించలేదు.
ఇవీ చదవండి..
అలిపిరి కాలినడక మార్గంలో దొంగలు
దేవాలయాలపై దాడులను నిరసిస్తూ ప్రత్యేక యాత్ర
Tags :