Black Fungus: మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ వాసి మృతి

తాజా వార్తలు

Updated : 22/05/2021 13:20 IST

Black Fungus: మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ వాసి మృతి

హైదరాబాద్: బ్లాక్ ఫంగ‌స్ బారిన ప‌డి గాంధీ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ జిల్లా తాండూరు మండలం ఎల్మ‌క‌న్నె వాసి వెంక‌ట్‌రెడ్డి(46) మృతిచెందారు. ఇటీవ‌ల క‌రోనా నుంచి కోలుకున్న ఆయ‌న కంటికి ఇన్‌ఫెక్ష‌న్ కావ‌డంతో అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. కుటుంబ స‌భ్యులు వెంక‌ట్‌రెడ్డిని జిల్లా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప‌రీక్షించిన వైద్యులు బాధితుడికి బ్లాక్‌ఫంగ‌స్ సోకిన‌ట్లు నిర్ధ‌రించారు. అక్క‌డ చికిత్స పొందుతుండ‌గా నిన్న రాత్రి వెంక‌ట్‌రెడ్డి ప‌రిస్థితి విష‌మించింది. దీంతో సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ ఆయ‌న ఈ ఉద‌యం మృతిచెందారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని