బెంగాల్‌లో పేలుడు.. ఐదుగురు మృతి

తాజా వార్తలు

Updated : 19/11/2020 16:18 IST

బెంగాల్‌లో పేలుడు.. ఐదుగురు మృతి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో గురువారం భారీ పేలుడు ప్రమాదం చోటుచేసుకుంది. మాల్డా జిల్లాలోని సుజాపూర్‌ ప్రాంతంలోని ప్లాస్టిక్‌ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో ఐదుగురు మరణించారు. మరో ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు. కాగా ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ స్పందిస్తూ.. ‘బాధితులను తక్షణమే ఆదుకోవాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు నష్టపరిహారం అందిస్తాం. జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, సీనియర్‌ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీస్తున్నారు. ప్లాస్టిక్‌ వస్తువులు తయారీ చేస్తుండగా ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి  మెరుగైన చికిత్స అందజేస్తున్నాం’అని బందోపాధ్యాయ్‌ తెలిపారు. ఈ ఘటన గురువారం ఉదయం 11గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని