కుత్బుల్లాపూర్‌లో పేలుడు
close

తాజా వార్తలు

Updated : 12/05/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుత్బుల్లాపూర్‌లో పేలుడు

కుత్బుల్లాపూర్‌: హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌ జయరాంనగర్‌ చౌరస్తా వద్ద భారీ పేలుడు సంభవించింది. ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న బ్యాగ్‌ను విసరడంతో ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న ఓ పూజసామగ్రి దుకాణం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. పేలుడు శబ్దం సుమారు కిలోమీటర్‌కుపైగా వినిపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. బ్యాగ్‌తో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని చేతిలో మరో బ్యాగు ఉండడంతో పోలీసులు ఇంకో బ్యాగ్‌ను తెరవడానికి డాగ్‌ స్క్వాడ్‌ రప్పించారు. అందులో చెత్తఉండడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తనకు బ్యాగ్‌ బాలానగర్‌లో దొరికిందని, దానిని తీసుకువస్తుండగా కుక్కలు మొరగడంతో పడేసినట్లు అనుమానితుడు పోలీసులతో చెప్పాడు. దీంతో క్లూస్‌ టీమ్‌ సాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని