అదృశ్యమై.. ఇంటి సమీపంలోనే విగతజీవిగా!

తాజా వార్తలు

Updated : 16/03/2021 08:32 IST

అదృశ్యమై.. ఇంటి సమీపంలోనే విగతజీవిగా!

గుంటూరు జిల్లా మెల్లెంపూడిలో బాలుడి మృతి
హత్యా? వేరే కారణమా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మెల్లెంపూడిలో అదృశ్యమైన బాలుడి కథ విషాదాంతమైంది. ఆదివారం అదృశ్యమైన బాలుడు భార్గవ తేజ(6) సోమవారం సాయంత్రం తమ ఇంటి సమీపంలోని పొలాల్లో విగతజీవిగా కనిపించాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు భగవానియా నాయక్‌, అమల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

భగవానియా నాయక్‌ ఓ ప్రైవేటు యూనివర్సిటీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు భార్గవ తేజ నిన్న సాయంత్రం అదృశ్యమయ్యాడు. ఎంత వెతికినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపడుతుండగా తమ ఇంటికి సమీపంలోని పొలాల్లో  భార్గవతేజ విగతజీవిగా పడి ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. భార్గవతేజ మెల్లెంపూడి ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. బాలుడి శరీరంపై గాయాలు ఉండడంతో ఎవరైనా హత్య చేశారా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని