AP News: తెదేపా నేతల దారుణ హత్య
close

తాజా వార్తలు

Updated : 17/06/2021 12:09 IST

AP News: తెదేపా నేతల దారుణ హత్య

గ‌డివేముల‌: క‌ర్నూలు జిల్లా గ‌డివేముల మండ‌లం పెస‌ర‌వాయిలో తెదేపా నేతలు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. అన్నదమ్ములైన మాజీ స‌ర్పంచి నాగేశ్వ‌ర‌రెడ్డి, స‌హ‌కార సంఘం మాజీ అధ్య‌క్షుడు ప్ర‌తాప్‌రెడ్డిని కొంద‌రు బొలేరో వాహ‌నంతో ఢీకొట్టి చంపేశారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ముగ్గురికి గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన వారిని నంద్యాల ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. శ్మ‌శానం నుంచి తిరిగి వ‌స్తుండగా వైకాపా నాయ‌కులే వీరిని వాహ‌నంతో ఢీకొట్టించి హ‌త్య చేశార‌ని బంధువులు ఆరోపిస్తున్నారు.

మృతిచెందిన అన్న‌ద‌మ్ముల వ‌ర్గానికి, శ్రీ‌కాంత్‌రెడ్డి అనే వ‌ర్గానికి ద‌శాబ్దాలుగా ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌లు ఉన్న‌ట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ పోలీసులు హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ను నిర్ధారించ‌లేదు. ఘ‌ట‌న‌పై కేసు కూడా న‌మోదు చేయ‌లేదు. నిందితులు ఎవ‌ర‌నే దానిపై విచారిస్తున్నారు. అన్న‌ద‌మ్ముల హ‌త్య నేప‌థ్యంలో గ్రామంలో ఎలాంటి ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని