కన్నీరు పెట్టిస్తోన్న బీటెక్‌ విద్యార్థి సెల్ఫీ వీడియో

తాజా వార్తలు

Updated : 07/01/2021 06:17 IST

కన్నీరు పెట్టిస్తోన్న బీటెక్‌ విద్యార్థి సెల్ఫీ వీడియో

కళాశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య

పెనుగంచిప్రోలు: చదువుల భారం ఓ ఘోరానికి కారణమైంది. తల్లిదండ్రులకు ఆరని కడుపుమంట రగిల్చింది. పొత్తిళ్లలో పెరిగిన బిడ్డ ఒత్తిళ్లకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. జీవితంలో పైకి రావాల్సిన కుమారుడు ‘క్షమించమ్మా’ అంటూ కళాశాల పైనుంచి దూకి మృతిచెందాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ వీడియో.. ఇప్పుడు అందిరితో కన్నీరు పెట్టిస్తోంది.  వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలుకు చెందిన వడ్డెల్లి గోపాలరావు, తులసి దంపతులకు తిరుమలేశ్‌ ఒక్కగానొక్క సంతానం. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో తల్లి ఉపాధ్యాయురాలిగా, తండ్రి బోధనేతర సిబ్బందిగా పనిచేస్తూ కుమారుడు అల్లారుముద్దుగా పెంచారు. ఏలూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్‌ చదివిస్తున్నారు. 

లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికొచ్చి సంతోషంగా గడిపిన తిరుమలేశ్‌.. కళాశాలకు వెళ్లిన నాలుగు రోజులకే చదవలేకపోతున్నానంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం సెల్ఫీ వీడియో తీసుకుని తల్లిదండ్రులు, మిత్రులకు పంపించి కళాశాల భవనం పైనుంచి దూకేశాడు. ‘అమ్మానాన్నా.. మీరు నిండు నూరేళ్లు జీవించండి’ అంటూ అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాడు. కొనఊపిరితో ఉన్న తిరుమలేశ్‌ను విజయవాడ తరలించి అత్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు నిలవలేదు. ఏదో ఒక రూపంలో తమ బిడ్డ ఈలోకంలో బతికి ఉండాలనే ఉద్దేశంతో తిరుమలేశ్‌ నేత్రాలు ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి దానం చేశారు. మంగళవారం పెనుగంచిప్రోలులో అంత్యక్రియలు నిర్వహించారు. 

ఇవీ చదవండి..

బాలికపై రేప్‌ కేసులో సంచలన తీర్పు

ఐటీ అధికారులమని వెళ్లి కిడ్నాప్‌ చేశారు: సీపీAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని