mumbai: ముంబయిలో ఘోర ప్రమాదం: 11 మంది మృతి
close

తాజా వార్తలు

Updated : 10/06/2021 09:03 IST

mumbai: ముంబయిలో ఘోర ప్రమాదం: 11 మంది మృతి

ముంబయి: ముంబయిలో ఘోర ప్రమాదం జరిగింది. మల్వానిలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, విపత్తు బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. భవనం కూలిన సమయంలో పిల్లలు కూడా ఉన్నారు. స్థానికులు, పోలీసుల సహాయంతో విపత్తు సిబ్బంది శిథిలాల నుంచి 8 మందిని రక్షించారు. గాయపడిన వారిని బీడీబీఏ మున్సిపల్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాలవల్లే భవనం కూలినట్లు మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్‌ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు సమీప భవనాల్లో ఉంటున్న ప్రజలను ఖాళీ చేయించారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని