మాదాపూర్‌లో కారు బీభత్సం: ఒకరి మృతి

తాజా వార్తలు

Updated : 28/06/2021 05:39 IST

మాదాపూర్‌లో కారు బీభత్సం: ఒకరి మృతి

హైదరాబాద్‌: మాదాపూర్‌లోని ఐకియా సమీపంలో కారు బీభత్సానికి ఒకరు బలయ్యారు. వేగంగా వచ్చిన కారు ఆటోను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మాదాపూర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌ ఐకియా- మై హోం అంబ్రా మార్గంలో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన ఆడి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో వెనుక కూర్చున్న  ప్రయాణికుడు బేగంపేటకు చెందిన వై.ఉమేష్‌ కుమార్‌(37) ఆటోలో నుంచి ఎగిరి ఫుట్‌పాత్‌పై పడ్డాడు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలతో బయటపడిన ఆటో డ్రైవర్‌ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కారు నడిపిన వ్యక్తి కారును ఘటనాస్థలంలోనే వదిలి పరారయ్యాడు. కారు ఉప్పల్‌కు చెందిన వాకిటి రఘు నందనరెడ్డి పేరున ఉందని పోలీసులు తెలిపారు. మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన వ్యక్తి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని