close

తాజా వార్తలు

Updated : 27/02/2021 11:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వనస్థలిపురంలో కారు బీభత్సం

హైదరాబాద్‌ : వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హస్తినాపురంలో ఈరోజు తెల్లవారు జామున కారు బీభత్సం సృష్టించింది. గౌతమ్‌ అనే యువకుడు మద్యం మత్తులో కారు నడిపి ట్రాఫిక్‌ సిగ్నల్‌ స్తంభాన్ని ఢీకొట్టాడు. అనంతరం డివైడర్‌ పై నుంచి మరో పక్కకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న సందీప్‌ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు పరారయ్యాడు. కారు నడిపిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు సాగర్‌ రోడ్‌ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని