విజయవాడలో భారీగా పట్టుబడ్డ నగదు
close

తాజా వార్తలు

Updated : 09/03/2021 02:09 IST

విజయవాడలో భారీగా పట్టుబడ్డ నగదు

అజిత్‌సింగ్‌ నగర్‌: విజయవాడలోని ఓ ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది.  వివరాల్లోకి వెళ్తే అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి 57వ డివిజన్‌లోని న్యూ-రాజరాజేశ్వరిపేటకు చెందిన వెల్డర్‌ పిల్ల కూర్మనాయకులు అమరావతి కాలనీలోని మూడో రోడ్డులో నివాసముంటున్నారు. నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో అతడి ఇంట్లో నగదు నిల్వచేశారనే సమాచారంతో టాస్క్‌ ఫోర్సు, ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం రూ.48.44 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. 

కూర్మనాయకులు మాత్రం ఆ డబ్బంతా తనదేనని.. అవసరమైతే దానికి సంబంధించిన అన్ని పత్రాలనూ చూపిస్తానని చెప్పడంతో పోలీసులు ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ వ్యవహారంపై సీఐ లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. పట్టుబడిన నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపని కారణంగా ఆ మొత్తాన్ని సీజ్‌ చేశామన్నారు. నగదు పత్రాలను కూర్మ నాయకులు ఆదాయపన్ను శాఖ అధికారులకు చూపాల్సి ఉందన్నారు. 

డబ్బుతో పట్టుబడిన వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గంలోని గాంధీ నగర్‌ ప్రాంతానికి చెందిన ఓ వైకాపా కార్పొరేటర్‌ అభ్యర్థికి సమీప బంధువుగా తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అజిత్‌సింగ్‌ నగర్‌లో పెద్దమొత్తంలో నగదు పట్టుబడటంతో పోలీసులు, ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు. నార్త్‌ జోన్‌ ఏసీపీ షేక్‌ షానూ ఆధ్వర్యంలో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని