గుంటూరులో నడిరోడ్డుపై రూ.9 లక్షల దోపిడీ
close

తాజా వార్తలు

Published : 19/04/2021 12:35 IST

గుంటూరులో నడిరోడ్డుపై రూ.9 లక్షల దోపిడీ

గుంటూరు: నడిరోడ్డుపై, పట్టపగలే లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. గుంటూరులోని కొరిటెపాడుకు చెందిన ఓ వ్యక్తి మిర్చి యార్డులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వ్యాపార లావాదేవీల నిమిత్తం పట్నం బజారులోని సిటీ యూనియన్‌ బ్యాంకులో రూ.9 లక్షలు డ్రాచేసి డబ్బు సంచిని ద్విచక్రవాహనం డిక్కీలో ఉంచాడు. స్థానికంగా టిఫిన్‌ చేసిన అనంతరం తన దుకాణానికి వెళ్లి బైక్‌లో డబ్బు కోసం చూడగా కనిపించలేదు. చోరీకి గురైందని గమనించి లాలాపేట పోలీసులను ఆశ్రయించాడు.

డబ్బును ఓ వ్యక్తి దొంగిలించినట్లు పోలీసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ద్విచక్రవాహనంలో డబ్బు పెడుతుండగా  సమీపంలోనే ఉండి గమనించిన ఓ దొంగ గమనించాడు. వాహనదారుడు టిఫిన్‌ చేసేందుకు వెళ్లగానే ద్విచక్రవాహనం డిక్కీ తెరిచి ఆ మొత్తాన్ని దొంగిలించాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని