Viveka murder case: మరో ఏడుగురిని ప్రశ్నిస్తున్న సీబీఐ

తాజా వార్తలు

Updated : 27/07/2021 11:28 IST

Viveka murder case: మరో ఏడుగురిని ప్రశ్నిస్తున్న సీబీఐ

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో 51వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడపలోని కేంద్ర కారాగారం అతిథి గృహంలో ఏడుగురు అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. పులివెందులకు చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, తిరుపతికి చెందిన డాక్టర్‌ సతీశ్‌కుమార్‌, డా.మధు, కిశోర్‌కుమార్‌, ప్రొద్దుటూరుకు చెందిన భాస్కర్‌రెడ్డి, పులివెందులకు చెందిన డాక్టర్‌ నాయక్‌ను అధికారులు విచారిస్తున్నారు.

నిన్న సీబీఐ అధికారులు పులివెందులోని వైఎస్‌ ఇంటిని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించిన విషయం తెలిసిందే. వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగన్న ఇటీవల జమ్మలమడుగు మేజిస్ట్రేట్‌ వద్ద వాంగ్మూలం ఇవ్వడం.. ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న కొందరి పేర్లను రంగన్న స్థానికులకు చెప్పడంతో తెలుగురాష్ట్రాల్లో ఈ కేసు మరోసారి చర్చనీయాంశమైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని