వివేకా హత్య కేసు: కీలక వ్యక్తుల విచారణ

తాజా వార్తలు

Updated : 06/07/2021 13:20 IST

వివేకా హత్య కేసు: కీలక వ్యక్తుల విచారణ

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 30వ రోజు కొనసాగుతోంది. నెల రోజుల నుంచి అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు ప్రస్తుతం కీలక వ్యక్తుల నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు. వివేకా హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేశారని సిట్‌ అరెస్టు చేసిన ఎర్ర గంగిరెడ్డితో పాటు వివేకా పీఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇదయతుల్లా, డ్రైవర్‌ ప్రసాద్‌, వైకాపా కార్యకర్త కిరణ్‌కుమార్‌ యాదవ్‌ను సీబీఐ అధికారులు మరోసారి ప్రశ్నిస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఈ ఐదుగురిని పులివెందుల అతిథి గృహంలో విచారించిన అధికారులు ఇవాళ మరోసారి విచారణకు పిలిచారు. ఈ ఉదయం కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహానికి వచ్చిన ఈ ఐదుగురిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని