close

తాజా వార్తలు

Published : 23/02/2021 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సిగరెట్‌ కొన్నాడు..మంగళసూత్రం లాక్కెళ్లాడు

నాగోలు (హైదరాబాద్‌) : సిగరెట్‌ కొనేందుకు వచ్చిన ఓ యువకుడు కిరాణ దుకాణంలోని మహిళ మంగళ సూత్రాన్ని లాక్కెళ్లాడు. ఎల్బీనగర్‌ డిటెక్టివ్‌ ఇన్ స్పెక్టర్‌ కృష్ణమోహన్‌ కథనం ప్రకారం... సాగర్‌రింగ్‌ రోడ్డు సమీపంలోని మల్లికార్జుననగర్‌లో రేవు సుజాత(55), మల్లేష్‌ దంపతులు కిరాణదుకాణం నిర్వహిస్తున్నారు. రాత్రి 8.30 సమయంలో దుకాణంలో సుజాత ఉండగా ఆగంతకుడు(25) బైకుపై అటుగా వచ్చాడు. సిగరెట్, కుర్‌కురే ప్యాకెట్‌ ఇవ్వమన్నాడు. తీసుకొని, టేబుల్‌పై డబ్బులు పెట్టాడు. ఆమె తీసుకుంటుండగా మెడలోని మూడున్నర తులాల బంగారు మంగళసూత్రాన్ని తెంచుకుని, ఆన్‌లోనే ఉంచుకున్న బైక్‌పై పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇవీ చదవండి


Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని