విదేశీ నగదు పేరిట మోసం
close

తాజా వార్తలు

Published : 08/07/2020 00:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విదేశీ నగదు పేరిట మోసం

● అంతరాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురి అరెస్టు

బేగంబజార్‌, న్యూస్‌టుడే: విదేశీ నగదు మార్పిడి చేయాలంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.లక్ష నగదుతోపాటు 300 సౌదీ దినామ్స్‌, 8 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. నగర టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ కథనం ప్రకారం.. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన రఫీక్‌ (28) కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. నగరానికి చెందిన మహిళతో వివాహం జరిగింది. భార్య రుక్సానతో కలిసి సులువుగా డబ్బు సంపాదించేందుకు పథకం రూపొందించాడు. ఇద్దరూ ముంబయికి వెళ్లి అక్కడి అమృత్‌నగర్‌ దర్గా ప్రాంతానికి చెందిన షేక్‌ అతీఫ్‌, సత్తార్‌, అజీజ్‌లతో కల్సి ముఠా ఏర్పాటు చేశారు. అక్కడే సౌదీకి చెందిన కొన్ని నోట్లను కొనుగోలు చేశారు. వాటిని తీసుకుని వచ్చి నగరంలోని మానికేశ్వరీ నగర్‌లో ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుని తమ వద్ద రూ.2.40 లక్షల విలువ చేసే రూ.12 వేల విలువైన నోట్లు ఉన్నాయని వాటిని మార్పిడి చేయించాలని కోరారు. ఈ నెల 4న సౌదీ నోట్లు మార్పిడికి చేయించుకునేందుకు రంగ్‌మహల్‌ చౌరస్తాకి రావాలని సూచించారు. కొన్ని కాగితాలను నోట్ల కట్టను పోలినట్లు చేసి సదరు వ్యక్తికి ఇచ్చారు. అతని నుంచి రూ.లక్ష నగదు తీసుకున్నారు. సమాచారం మేరకు పోలీసులు.. అక్కడున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని