తిరుపతిలో కిడ్నాపైన బాలుడు సురక్షితం

తాజా వార్తలు

Published : 14/03/2021 01:03 IST

తిరుపతిలో కిడ్నాపైన బాలుడు సురక్షితం

విజయవాడలో గుర్తించిన పోలీసులు

తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతిలో అపహరణకు గురైన ఛత్తీస్‌గఢ్‌ బాలుడు శివమ్‌ సాహు సురక్షితంగా ఉన్నాడు. ఆరేళ్ల బాలుడిని విజయవాడలో గుర్తించిన పోలీసులు చైల్డ్‌ లైన్‌కు అప్పగించారు. గత నెల 27వ తేదీన తిరుపతి అలిపిరిలో శివమ్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. బాలుడు కిడ్నాప్‌కు గురైనప్పటినుంచి అతని తల్లిదండ్రులు తిరుపతిలోనే బాలుడి ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. బాలుడు దొరికిన విషయాన్ని విజయవాడ పోలీసులు తిరుపతి అర్బన్‌ పోలీసులకు తెలియజేశారు. దీంతో అర్బన్ పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు విజయవాడకు బయలుదేరారు. బాలుడిని త్వరలో తల్లిదండ్రుల వద్దకు చేర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లోని కురూస్‌ గ్రామం నుంచి ఫిబ్రవరి 23న ప్రైవేటు బస్సులో 55 మంది ఆలయాల సందర్శన నిమిత్తం బయలుదేరి వచ్చారు. వారిలో ఉత్తమ్‌ కుమార్‌ సాహు కుటుంబానికి చెందిన నలుగురిలో... శివమ్‌ కుమార్‌ సాహు(6) ఉన్నాడు. 27న తిరుపతి బాలాజీ లింకు బస్టాండుకు చేరుకుని శ్రీవారి దర్శనార్థం టోకన్లు తీసుకున్నారు. అదేరోజు స్థానిక ఆలయాలు సందర్శించి... మరుసటి రోజు ఉదయం తిరుమలకు వెళ్లేందుకు తిరిగి బాలాజీ లింకు బస్టాండు వద్దకే వచ్చారు. భోజనాలు చేసి పడుకునే సమయంలో శివమ్‌ కుమార్‌ సాహు కన్పించలేదు. చుట్టుపక్కల వెతికినా కన్పించకపోవడంతో అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని