close

తాజా వార్తలు

Published : 07/03/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

డబ్బులేక, ఆస్పత్రి ముందే చిన్నారి మృతి

లఖ్‌నవూ: బిల్లు చెల్లించలేదని, పూర్తిగా చికిత్స అందించకుండా ఓ ప్రైవేటు ఆసుపత్రి చేసిన నిర్వాకం మూడేళ్ల బాలిక నిండు ప్రాణాన్ని తీసింది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారడంతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రంగంలోకి దిగింది. శస్త్రచికిత్స తరవాత వైద్యులు సరిగా కుట్లు కూడా వేయలేదనే ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది. ఉత్తర్ ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా దీనిపై విచారణకు ఆదేశించింది. ఆ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఘటన జరిగింది. బాధిత కుటుంబం కౌశాంబి జిల్లాకు చెందినదిగా తెలుస్తోంది.  

పోలీసులు వెల్లడించి వివరాల ప్రకారం..‘ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు ఫిబ్రవరి 16న బాలికను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. శస్త్రచికిత్స చేసిన తరవాత ఆమెను ఎస్‌ఆర్‌ఎం ఆసుపత్రికి తీసుకెళ్లమని అక్కడి వైద్యులు బాలిక తల్లిదండ్రులకు సూచించారు. వారు వైద్యులు చెప్పిన దగ్గరికి కాకుండా చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు కూడా చికిత్స అందించారు. అక్కడి నుంచి మళ్లీ మొదట వైద్యం తీసుకున్న ప్రైవేటు ఆసుపత్రికే బాలికను తీసుకువచ్చారు. ఈ క్రమంలో బాలిక చనిపోయింది’ అని వెల్లడించారు.  

కాగా, బిల్లు చెల్లించలేదంటూ వైద్యులు తమ బిడ్డకు సరైన చికిత్స అందించలేదని ఆ వీడియోలో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘డబ్బులు తీసుకున్నాక..మా బిడ్డను డిశ్ఛార్జి చేస్తూ, మా చేతులు దాటిపోయిందని వైద్యులు అన్నారు. వాళ్లు ఏం అడిగితే అది ఇచ్చాం. మూడు సార్లు రక్తం అవసరమని చెప్తే..అదీ అందించాం’ అని చిన్నారి తండ్రి వాపోయారు. ఈ ఘటన వీడియోలను పరిశీలించిన కమిషన్..24 గంటల్లో నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఆసుపత్రి నిర్లక్ష్యం ఉందని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇదిలా ఉండగా..మృతురాలి కుటుంబం చేస్తోన్న ఆరోపణలను సదరు ఆసుపత్రి తోసిపుచ్చింది. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని