
తాజా వార్తలు
నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?
మదనపల్లె: మూఢ భక్తితో రెండు రోజుల కిందట తమ ఇద్దరు కూతుళ్లను చంపుకున్న చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన తల్లిదండ్రులను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. హత్యానేరం కింద వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తండ్రి పురుషోత్తంనాయుడు ఏ1, తల్లి పద్మజ ఏ2గా పేర్కొన్నారు. నిందితులను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు యత్నించగా.. పద్మజ నిరాకరించారు. ‘‘నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?. నా గొంతులో హాలాహలం ఉంది’’ అంటూ ఆసుపత్రిలోకి వచ్చేందుకు నిరాకరించారు. దీంతో పోలీసు వాహనం వద్దే పద్మజకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిందితులను మదనపల్లె తాలూకా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఏం జరిగిందంటే..
చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం శివనగర్‌లో నివాసం ఉండే పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతులు ఆదివారం రాత్రి తమ ఇద్దరు కూతుళ్లు అయిన అలేఖ్య (27), సాయిదివ్య (22)లను మూఢనమ్మకాల పేరుతో హత్య చేశారు. ఉదయం తిరిగి బతికి వస్తారనే ఆధ్మాత్మిక భావనలో ఉన్న వాళ్లను రెండు రోజుల నుంచి ఘటన జరిగిన ఇంట్లోనే ఉంచి పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి..
మా చేతులతో మేమే చంపుకొన్నామే..