Attack on ACP: నడిరోడ్డుపై బీభత్సం.. మహిళా ఏసీపీ వేళ్లను నరికేసిన వీధి వ్యాపారి

తాజా వార్తలు

Published : 01/09/2021 01:19 IST

Attack on ACP: నడిరోడ్డుపై బీభత్సం.. మహిళా ఏసీపీ వేళ్లను నరికేసిన వీధి వ్యాపారి

ఠాణే: మహారాష్ట్రలోని ఠాణెలో చిరు వ్యాపారులు బీభత్సం సృష్టించారు. అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని.. ఖాళీ చేయించడానికి వెళ్లిన పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అసిస్టెంట్​ పోలీసు కమిషనర్ కల్పితా పింపుల్​​ చేతి మూడు వేళ్లు తెగిపడిపోయాయి.

రోడ్లు, ఫుట్‌పాత్‌లపై అక్రమంగా దుకాణాలు ఏర్పరుచుకున్న వీధి వ్యాపారులపై ఠాణె మున్సిపల్​ కార్పొరేషన్​ చర్యలు చేపట్టింది. మున్సిపల్​ కమిషనర్​ డాక్టర్​ విపిన్ శర్మ ఆదేశాలతో దుకాణాలను, తోపుడు బండ్లను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఘోడ్​బందర్​ రోడ్డులో సోమవారం సాయంత్రం ఇదే తరహాలో వ్యాపారులను ఖాళీ చేయించడానికి అధికారులు చేరుకోగా అక్కడ ఘర్షణ తలెత్తింది.ఈ క్రమంలో ఏసీపీపై కూరగాయల వ్యాపారి అమర్జీత్​ యాదవ్​ కత్తితో దాడి చేశాడు. దీంతో కల్పితా పింపుల్​ మూడు వేళ్లు తెగిపడ్డాయి. ఆమె తలకు కూడా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను హుటాహుటిన ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. ఏసీపీతోపాటు ఉన్న సెక్యూరీటీ గార్డు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దాడి కేసులో నిందితుడు అమర్జీత్​​ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై హత్యాయత్నం కేసు సహా ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించాడన్న అభియోగం కింద కేసు నమోదు చేశామని డిప్యూటీ కమిషనర్​ వినయ్​ రాఠోడ్​ పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని