షాకింగ్‌: కారు కొనేందుకు పసివాడిని అమ్మేశారు! 
close

తాజా వార్తలు

Published : 15/05/2021 01:12 IST

షాకింగ్‌: కారు కొనేందుకు పసివాడిని అమ్మేశారు! 

కాన్పూర్‌: యూపీలో షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. కారు కొనేందుకు ఓ జంట తమ కన్నపేగునే అమ్మకానికి పెట్టిన హృదయ విదారక ఘటన కన్నౌజ్‌ జిల్లా తిర్వా కొట్వాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఆ పసికందు అమ్మమ్మ, తాతయ్య గురువారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

సతౌర్‌కి చెందిన ఓ మహిళ మూడు నెలల క్రితం మగ శిశువుకి జన్మనిచ్చింది. అయితే, కారు కొనుగోలు చేసేందుకు గురుసాహైగంజ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు తన కుమార్తె, అల్లుడు కలిసి పసివాడిని రూ.1.5లక్షలకు విక్రయించినట్టు ఆ మహిళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆ శిశువు ఇప్పటికీ వ్యాపారి వద్దే ఉన్నాడని ఇన్‌స్పెక్టర్‌ శైలేంద్ర కుమార్‌ మిశ్రా తెలిపారు. శిశువును అమ్మకానికి పెట్టిన ఆ దంపతులను విచారణ కోసం పిలిచినట్టు ఆయన వెల్లడించారు. ఇటీవలే ఆ దంపతులు పాత కారును కొనుగోలు చేసినట్టు గుర్తించామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని