Rajasthan: 12 నిమిషాల్లో బంగారం, రూ. ల‌క్ష‌ల్లో చోరీ!

తాజా వార్తలు

Updated : 15/06/2021 12:16 IST

Rajasthan: 12 నిమిషాల్లో బంగారం, రూ. ల‌క్ష‌ల్లో చోరీ!

రాజస్థాన్‌లోని చూరు జిల్లాలో సినిమాను తలపించేలా భారీ చోరీ జరిగింది. 12 నిమిషాల్లోనే 17 కిలోల బంగారం, 9 లక్షల రూపాయలు దోచుకున్నారు నలుగురు దుండగులు. మణప్పురం గోల్డ్‌ లోన్‌ బ్రాంచ్‌లోకి ఆయుధాలతో ప్రవేశించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ద్విచక్రవాహనాలపై వచ్చిన దుండగులు సిబ్బందిని తుపాకులతో బెదిరించి శౌచాలయంలో బంధించారు. భవనంలోని అలారం ధ్వంసం చేశారు. సీసీటీవీ కెమెరాల వైర్లు కత్తిరించారు. బ్రాంచ్‌ ప్రధాన ద్వారం మూసివేసి బంగారం, నగదును తమ బ్యాగుల్లో సర్దుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని