కారులో కరెన్సీ కట్టలు
close

తాజా వార్తలు

Published : 08/04/2021 01:07 IST

కారులో కరెన్సీ కట్టలు

జగ్గయ్యపేట: ఏపీ-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఈరోజు ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా భారీగా నగదు పట్టుబడింది. కారులో తరలిస్తున్న కోటి నలభైలక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై సెక్షన్‌ 102 కింద కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్టు చిల్లకల్లు ఎస్‌ఐ వాసా వెంకటేశ్వరరావు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని