close
Array ( ) 1

తాజా వార్తలు

థర్మో స్కానర్ల పేరిట రూ.లక్ష స్వాహా

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: థర్మో స్కానర్లను తక్కువ ధరకు విక్రయిస్తామని ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష స్వాహా చేశారు సైబర్‌ నేరగాళ్లు. ఖైరతాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి థర్మో స్కానర్ల సమాచారం అందించే ఓ వెబ్‌సైట్‌లో సంస్థల వివరాలను పరిశీలించాడు. మహారాష్ట్రకు చెందిన ఓ సంస్థ కన్పించడంతో చరవాణికి ఫోన్‌ చేశాడు. ఒక్కొక్కటి రూ.300 చొప్పున 1400 స్కానర్లు కావాలని రూ.4.20 లక్షలకు ఆర్డర్‌ చేశాడు. ఒప్పందం ప్రకారం తొలుత రూ.లక్ష చెల్లించాలని అవతలి వారు చెప్పడంతో ఆ మొత్తం చెల్లించాడు. కొంత సమయం తర్వాత మళ్లీ ఫోన్‌ చేయగా పనిచేయడం లేదని వచ్చింది. మోసపోయానని గ్రహించి బుధవారం నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.