అమానుషం! కాళ్లతో తన్నుతూ.. కర్రలతో బాదుతూ..

తాజా వార్తలు

Published : 11/07/2021 01:07 IST

అమానుషం! కాళ్లతో తన్నుతూ.. కర్రలతో బాదుతూ..

కాన్పూర్‌: ఓ దళితుడిపై అగ్ర కులానికి చెందిన కొందరు వ్యక్తులు క్రూరత్వాన్ని ప్రదర్శించారు. కాళ్లతో తన్నుతూ.. కర్రలు, రాడ్లతో కొడుతూ చిత్రహింసలు పెట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ దేహత్‌ జిల్లా అక్బాపూర్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. ఓ గుడిసెలో కూర్చున్న 20 ఏళ్ల యువకుడి వద్దకు వెళ్లిన కొందరు వ్యక్తులు అతడిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. నీ కులం చెప్పాలంటూ కొట్టారు. ఆ యువకుడు తన కులం చెప్పడంతో మరింత రెచ్చిపోయిన ఆ గ్యాంగ్‌.. యువకుడి జుట్టు పట్టి లాగి కిందపడేసి కర్రలు, కాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడు నొప్పితో కేకలు వేస్తున్నా విడిచిపెట్టలేదు. ఇది చాలదన్నట్లు అనంతరం ఓ చెట్టుకు కట్టేసి మళ్లీ కొట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. విషయం కాన్పూర్‌ పోలీసుల దృష్టికి వెళ్లడంతో  ఓ నిందితుడిని అరెస్టు చేశారు. దాడి చేసిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు  అదనపు ఎస్పీ ఘన్‌శ్యామ్‌ చౌరాసియా వెల్లడించారు. బాధిత యువకుడు ప్రస్తుతం కాన్పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని