Cinema news: మైనర్‌పై వేధింపులు.. ప్రముఖ దర్శకుడి అల్లుడిపై కేసు నమోదు!

తాజా వార్తలు

Published : 22/10/2021 01:41 IST

Cinema news: మైనర్‌పై వేధింపులు.. ప్రముఖ దర్శకుడి అల్లుడిపై కేసు నమోదు!

చెన్నై: మైనర్‌ బాలికపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో ప్రముఖ దర్శకుడు శంకర్‌ అల్లుడు రోహిత్‌పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. చెన్నైకు చెందిన రోహిత్‌ ప్రస్తుతం తమిళనాడు క్రికెట్‌ లీగ్‌ క్రీడాకారుడిగా వ్యవహరిస్తున్నారు. రోహిత్‌ తండ్రి దామోదరన్‌కు చెందిన ఓ క్రికెట్‌ క్లబ్‌లో ఆట నేర్చుకోవడానికి వెళ్లిన తనపై కోచ్‌ తమరై కన్నన్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఇటీవల ఓ పదహారేళ్ల బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ వేధింపుల విషయాన్ని అధికారులకు చెబితే ఊరుకోమంటూ బెదిరిస్తున్నారని బాధితురాలు పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో, కోచ్‌ తమరై కన్నన్‌తోపాటు క్రికెట్‌ జట్టు కెప్టెన్ రోహిత్‌, క్లబ్‌ సెక్రటరీ దామోదరన్‌తోపాటు మరో ఇద్దరిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు స్థానిక పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ఈ ఏడాది జూన్‌ నెలలోనే శంకర్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్యతో రోహిత్‌ వివాహం జరిగింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని