Alert: అది మోసం.. అలాంటి మెసేజ్‌లకు స్పందించకండి!

తాజా వార్తలు

Published : 20/10/2021 01:02 IST

Alert: అది మోసం.. అలాంటి మెసేజ్‌లకు స్పందించకండి!

హైదరాబాద్‌: సైబర్‌ కేటుగాళ్లు తమ దోపిడీని కొత్త రూపాల్లో కొనసాగిస్తున్నారు. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా జేబుల్ని ఖాళీచేసే ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా ఆన్‌లైన్‌లో ‘డేటా ఎంట్రీ ఉద్యోగం’ పేరుతో సైబర్‌ మోసగాళ్లు నిరుద్యోగ యువతకు వల విసురుతున్నారని పోలీసులు హెచ్చరించారు. అదంతా మోసమని, వాటిని నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు. ‘‘ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ ఉద్యోగం పేరిట వచ్చే మెసేజ్‌లకు స్పందించకండి. ముందుగా మీ నుంచి అగ్రిమెంట్‌ తీసుకుంటారు. ఆ తర్వాత మీరు ఆ ఉద్యోగం సరిగా చేయడంలేదని మీపైనే కేసు పెడతామని బెదిరింపులకు గురిచేస్తారు. అంతేకాకుండా అబద్ధపు కోర్టు నోటీసును పంపించి డబ్బులు డిమాండ్‌ చేస్తారు.. జాగ్రత్త!’’ అంటూ సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ట్విటర్‌లో హెచ్చరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని