రూ.90లక్షలు ఇస్తే... కోటి ఇస్తాం!

తాజా వార్తలు

Published : 23/09/2020 01:18 IST

రూ.90లక్షలు ఇస్తే... కోటి ఇస్తాం!

కాకినాడ: రూ.90లక్షలు ఇస్తే.. కోటి రూపాయలు ఇస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ముఠాను తూర్పుగోదావరి జిల్లా సర్పవరం పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వం రూ.2వేల నోట్లను రద్దు చేస్తుందని, అందుకే రూ.500 నోట్లు 90లక్షలు ఇస్తే కోటి రూపాయలు విలువైన 2వేల రూపాయల నోట్లు ఇస్తామని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన నాగప్రసాద్‌ను విశాఖపట్నానికి చెందిన ఓ ముఠా నమ్మించింది.

అనుమానం వచ్చిన నాగప్రసాద్‌ పోలీసులను ఆశ్రయించడంతో విశాఖ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈకేసుకు సంబంధించిన వివరాలను సర్పవరం సీఐ గోవిందరాజులు మీడియాకు వెల్లడించారు. కాకినాడ గ్రామీణ మండలం వలకపాకలకు చెందిన నాగప్రసాద్‌ తో కాకినాడ కరణంగారి జంక్షన్‌కు చెందిన ఓ వ్యక్తికి పరిచయం ఉంది. దీంతో అతను విశాఖకు చెందిన వ్యక్తుల వ్యవహారాన్ని నోట్ల మార్పిడిపై నమ్మబలికినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే నాగప్రసాద్‌ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మాటు వేసి విశాఖ ముఠాను పట్టుకున్నట్టు సీఐ తెలిపారు. రూ.2వేల నోట్ల నిల్వలు లేకపోయినా మాయమాటలతో నమ్మించి డబ్బు కాజేసే ప్రయత్నం చేశారని సీఐ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని