విశాఖకు తరలిస్తున్న నకిలీ కరెన్సీ పట్టివేత
close

తాజా వార్తలు

Updated : 03/03/2021 15:58 IST

విశాఖకు తరలిస్తున్న నకిలీ కరెన్సీ పట్టివేత

కోరాపుట్‌: ఒడిశాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రూ.7.90 కోట్ల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కొరాపుట్‌ జిల్లా పొటాంగి పరిధిలోని సుంకీ అవుట్‌ పోస్టు వద్ద ఈ నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు చెప్పారు. వాహనాల తనిఖీ సమయంలో వీటిని గుర్తించామని కోరాపుట్‌ ఎస్పీ గుంటుపల్లి వరుణ్‌ తెలిపారు. నకిలీ నోట్లు తరలిస్తున్న కారుకు ఛత్తీస్‌గఢ్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఉందన్నారు. రూ.500 నోట్లను పెద్ద సంచుల్లో తరలిస్తున్నారని తెలిపారు. రాయ్‌పూర్‌ నుంచి విశాఖపట్నంలోని వ్యక్తికి నకిలీ నోట్లు అందించేందుకు నిందితులు వెళ్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని