close

తాజా వార్తలు

కన్న కూతురుపై.. తండ్రి అఘాయిత్యం

అరక్కోణం, న్యూస్‌టుడే: కన్న కూతురిని కంటికి రెప్పలాగా కాపాడాల్సిన తండ్రే.. కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన తమిళనాడులో జరిగింది. అరక్కోణం సమీప నెమిలి తాలూకాలోని ఓ ప్రాంతానికి చెందిన 43 ఏళ్ల వ్యక్తి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అతడి భార్య సెప్టెంబరు 15న మేకలను మేపడానికి వెళ్లగా.. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న 11 ఏళ్ల పెద్ద కుమార్తెపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడని కావేరిపాకం పోలీసులు చెప్పారు. తండ్రి బెదిరించడంతో భయపడిన ఆమె జరిగిన ఘోరాన్ని ఎవరికీ చెప్పలేదు. బుధవారం బాలిక అనారోగ్యానికి గురికావడంతో వేలూరులోని ఆస్పత్రికి తల్లి తీసుకెళ్లింది. వైద్యులు ఆ బాలిక అత్యాచారానికి గురైనట్లు నిర్ధారించారు. తల్లి ప్రశ్నించగా జరిగిన విషయాన్ని ఆమెతో చెప్పింది. పోక్సో చట్టం కింద ఆ కామాంధుడిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.