అనుమానాస్పదస్థితిలో తండ్రి, కుమార్తె మృతి
close

తాజా వార్తలు

Updated : 10/04/2021 16:58 IST

అనుమానాస్పదస్థితిలో తండ్రి, కుమార్తె మృతి

సత్యనారాయణపురం(విజయవాడ):  నగరంలోని శ్రీనగర్‌ కాలనీ రెండోలైన్‌లో విషాదం చోటుచేసుకుంది. భార్య అనారోగ్యానికి గురైందనే మనస్తాపంతో భర్త జగాని రవి (40), తన పదేళ్ల కుమార్తెతో కలిసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణించిన తర్వాత తమ అవయవాలను భార్య భరణికి ఇవ్వాలని ఆత్మహత్య లేఖలో పేర్కొన్నారు. గత కొంత కాలంగా రవి భార్య భరణి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. రవి గతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసి లాక్‌డౌన్‌కు ముందు మానేసి ఇంటి దగ్గరే ఉంటున్నాడని బంధువులు తెలిపారు.

భార్య అనారోగ్యం, చిన్ననాటి నుంచి పెంచిన నానమ్మ ఇటీవలే మృతి చెందటంతో రవి తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు బంధువులు చెబుతున్నారు. ఈ కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. అయితే, మృతుడి కాళ్లు, చేతులు కట్టేయడం, ముఖానికి గుడ్డ కట్టి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. విషయం తెలుసుకున్న సత్యనారాయణపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు. వీరు నిజంగా ఆత్మహత్య చేసుకున్నారా?లేక హత్యా?అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని