close

తాజా వార్తలు

Updated : 02/03/2021 16:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అవార్డు పేరుతో చిత్ర దర్శకుడికి టోకరా 

హైదరాబాద్‌: గతేడాది విడుదలైన హీరో నితిన్‌ నటించిన ‘భీష్మ’ చిత్ర దర్శకుడు వెంకట్‌ కుడుముల  నుంచి సైబర్‌ దొంగలు రూ.63 వేలు కాజేశారు. సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం దర్శకుడు వెంకట్‌కు ఓ వ్యక్తి ఫోన్‌ చేశారు. మీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భీష్మ’ చిత్రం అంతర్జాతీయ చిత్రోత్సవానికి, పురస్కారాలకు ఎంపికైందని చెప్పాడు. ఏయే విభాగాల్లో అవార్డులకు ఎంపికైందో కూడా వివరించాడు. ప్రాసెసింగ్‌ ఫీజు నిమిత్తం ఒక్కో విభాగానికి రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుందని, రూ.63 వేలు బదిలీ చేయించుకున్నాడు. ఆ తర్వాతగానీ దర్శకుడు తాను మోసపోయానని తెలుసుకోలేకపోయారు.  



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని