TS NEWS: కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం

తాజా వార్తలు

Published : 10/07/2021 16:24 IST

TS NEWS: కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలోని ప్రశాంత్‌నగర్‌ పారిశ్రామికవాడలో ఈరోజు మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జీఎస్‌ఎన్‌ లైఫ్‌సైన్స్‌ ఫార్మా పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు.  పక్కనే ఉన్న ఇంటీరియర్‌ వస్తువుల దుకాణానికి మంటలు వ్యాపించాయి. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మూడు అగ్నిమాపక శకటాలతో మంటలు అదుపు చేశారు. ఈఘటనలో భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్టు సమాచారం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని