గాంధీనగర్‌ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

తాజా వార్తలు

Updated : 13/07/2021 12:54 IST

గాంధీనగర్‌ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగరంలోని బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్ పరిధి గాంధీనగర్‌ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం సంభవించింది. పారిశ్రామిక వాడలోని రంగారెడ్డి నగర్‌లో ఉన్న ప్రేరణి ఇండస్ట్రీస్‌ ప్లైవుడ్‌ గోదాములో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. గోదాములో కర్రలు ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని