close

తాజా వార్తలు

Updated : 17/04/2021 14:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

జీడిమెట్ల: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం సంభవించింది. పారిశ్రామిక ప్రాంత పరిధిలోని రాంరెడ్డి నగర్‌లో గల ఓ రసాయన పరిశ్రమలో ఈ మధ్యాహ్నం ప్రమాదం చోటు చేసుకోవడంతో మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. పరిశ్రమలోని కెమికల్‌ డ్రమ్ములకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా గోదాం మొత్తం మంటలు విస్తరించాయి. భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో ఘటనాస్థలికి సమీపంలోని 500 మీటర్ల వరకు వేడి వాతావరణం వ్యాపించింది.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని