విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ₹3 కోట్ల‌ న‌ష్టం
close

తాజా వార్తలు

Published : 31/05/2021 01:05 IST

విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం.. ₹3 కోట్ల‌ న‌ష్టం

రామ‌గుండం: పెద్ద‌ప‌ల్లి జిల్లా రామ‌గుండం తెలంగాణ థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం గుత్తేదారు కార్యాలయంలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. విద్యుత్ కేంద్రం ప‌నుల‌ను టాటా సంస్థ చేప‌డుతోంది. విద్యుదాఘాతం వ‌ల్ల ఎయిర్‌కండిషన్ ప‌రిక‌రాలు ద‌గ్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. దాదాపు రూ.3 కోట్ల మేర ఆస్తి న‌ష్టం జ‌రిగిన‌ట్లు టాటా కార్యాల‌యం నిర్వాహ‌కులు తెలిపారు. ఎన్టీపీసీ, గోదావ‌రిఖ‌ని అగ్నిమాప‌క సిబ్బంది సంయుక్తంగా శ్ర‌మించి మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుదాఘాతానికి గ‌ల కార‌ణాల‌పై అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని