మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

తాజా వార్తలు

Published : 22/12/2020 02:09 IST

మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

బుందోల్‌: మ‌ధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లా బుందోల్‌లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్‌ప్లాజా సమీపంలో పార్కింగ్‌ చేసి ఉన్న ఆయిల్‌ ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వీరు బెంగళూరుకు వెళ్తున్నారు. ఈక్రమంలో కారు వేగంగా వెళ్తూ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది.  

ఇవీ చదవండి..

మైనర్‌ చెల్లికి డ్రగ్స్‌ ఇచ్చి వ్యభిచారం

పదోతరగతి బాలికకు తాళి కట్టేందుకు యత్నం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని