AP news: విశాఖ పెద్దేరు వాగు పడి నలుగురు చిన్నారుల మృతి

తాజా వార్తలు

Published : 27/07/2021 01:43 IST

AP news: విశాఖ పెద్దేరు వాగు పడి నలుగురు చిన్నారుల మృతి

మాడుగుల గ్రామీణం: విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వి.మాడుగుల మండలం జాలంపిల్లి వద్ద పెద్దేరు వాగులో పడి నలుగు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. బట్టలు ఉతికేందుకు పెద్దలతోపాటు వెళ్లి ప్రమాదవశాత్తు పెద్ద రేవు ఊబిలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టగా అప్పటికే ప్రాణాలు కల్పోయారు. వీరంతా గిరిజన కుటుంబాలకు చెందినవారు. మృతి చెందిన వారిలో నీలాపు మహేందర్ (7), వంత్తాల వెంకట ఝాన్సీ (10), వంత్తాల షర్మిల (7)వంత్తాల ఝాహ్నవి (11) ఉన్నారు.  సమాచారమందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని